MI vs KXIP: డబుల్ సూపర్ ఓవర్ లో పంజాబ్‌ విక్టరీ

IPL 2020   దుబాయ్‌ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ డబుల్ సూపర్ ఓవర్‌లో ముంబై ఇండియన్స్ పై విక్టరీ సాదించింది. ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు. సూపర్‌ ఓవర్ కూడా టైగా మారింది. దీంతో మరో సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు. దీనిలో పంజాబ్‌ అద్బుత ప్రదర్శన చేసి లీగ్‌లో మూడో విజయాన్ని నమోదు చేసింది.

మొదటి సూపర్ సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయి 5 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ నాలుగు బంతుల్లో నాలుగు పరుగులు చేసి ఔటయ్యాడు. పూరన్ ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరాడు. సూపర్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ వేశాడు బుమ్రా. అనంతరం షమి జాగ్రత్తగా బౌలింగ్‌ చేయడంతో ముంబై సరిగ్గా అయిదు పరుగులే చేసింది. ఆఖరి బంతికి డికాక్‌ రెండో పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. దీంతో మరో సూపర్ ఓవర్ నిర్వహించాల్సి వచ్చింది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన ముంబై వికెట్ కోల్పోయి 11 పరుగులు చేసింది. తర్వాత పంజాబ్ తరుపున బరిలోకి దిగిన గేల్‌, మయాంక్‌ టార్గెట్ మరో రెండు బంతులుండగానే ఫినిష్ చేసి..జట్టుకు సూపర్ విజయాన్ని అందించారు.

అంతకుమందు టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై ఆరు వికెట్లు కోల్పోయి 176 రన్స్ చేసింది. డికాక్‌ (53; 43 బంతుల్లో, 3×4, 3×6), పొలార్డ్‌ (34*; 12 బంతుల్లో, 1×4, 4×4), కౌల్టర్‌నైల్‌ (24*, 12 బంతుల్లో, 4×4) మంచి ప్రదర్శన చేశారు. అనంతరం బరిలోకి దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులే చేసింది. కేఎల్‌ రాహుల్ (77; 51 బంతుల్లో, 7×4, 3×6) అదరరగొట్టాడు.