రైతులను నిండాముంచేసిన మిచౌంగ్ తుఫాన్

ద్వారకాతిరుమల మండలం, జనసేన పార్టీ మండలంలో పరిసర ప్రాంతాల్లో పలు గ్రామాల్లో మిచాంగు తుఫాన్ తాకిడికి మునిగినటువంటి పంటను పరిశీలిస్తూ రైతాంగం తరపున ఈ ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ రైతే దేశానికి వెన్నుముక అనే నానుడిని గుర్తించాలని జనసేన పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ రానున్న రోజుల్లో రైతాంగం అంతా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని కోరుకుంటూ తక్షణమే అధికారులు రైతాంగాన్ని గుర్తించి వారికి నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాం అని ద్వారకాతిరుమల మండల అధ్యక్షులు దాకారపు నరసింహమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు చిలుకూరు ఫణి.ద్వారకాతిరుమల అధ్యక్షులు కోట అంజనీ కుమార్, గుండుగొలుకుంట. అధ్యక్షులు.అద్దంకి శేఖర్, మధ్యాహ్నపు. నారాయణస్వామి, మధ్యాహ్న పు. వేణుగోపాలకృష్ణ, బి పవన్, టి పవన్, ఆరిఫ్, అన్నవరం ప్రసాదు, ధర్మేంద్ర, వి వెంకన్న బాబు తదితరులు పాల్గొన్నారు.