తొందరలోనే గిరిజన ప్రజలు వైసీపీ చాప చుట్టేయ్యబోతున్నారు

  • అల్లూరి జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారామ్ చింతపల్లి మండల ఉపాధ్యక్షులు వంతల రాజారావు

పాడేరు: చింతపల్లి లోతుగెడ్డ పంచాయితీ గ్రామాలైన లింగాల గుడి, పిసిరి మామిడి గ్రామస్తుల పిలుపు మేరకు జనసేన పార్టీ పాడేరు ఇన్చార్జ్ డా. గంగులయ్య ఆదేశాలతో ఆ గ్రామాలని సందర్శించిన జనసేన పార్టీ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉల్లి సీతారామ్, మండల ఉపాధ్యక్షులు వంతల రాజారావు తదితర జనసైనికులు స్థానిక గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఉల్లి సీతారామ్ మాట్లాడుతూ అనేక రంగాల్లో ఉన్న వివిధ ఉద్యోగులను, రైతులను, గిరిజన ప్రజలను మోసం చేసిన ప్రభుత్వ తీరుని ఇవాళ పాడేరు నియోజకవర్గం స్థాయిలో పర్యటిస్తూ ప్రతి గ్రామానికి గిరిజన రాజకీయచైతన్యం కలిగిస్తున్నామన్నారు. వైసీపీ నాయకులు కేవలం పదవులకోసమే జాతిని సైతం తాకట్టుపెట్టే వాళ్ళని అటువంటి రాజకీయాలు వాళ్ళకి సంపాదించుకోవడానికి సరిపోతాయమే కానీ గిరిజన ప్రజలను అభివృద్ధివైపు నడిపించేందుకు కాదన్నారు.వైసీపీ గిరిజన నాయకులపై మాకు ఎటువంటి ద్వేషం లేదని కానీ వాళ్ళు ఎంచుకున్న వైసీపీ పార్టీ విధానాలు అద్వాన్నంగా ఉన్నాయని అవి గిరిజన ప్రజలకు మేలు చేస్తాయని ఆశించడం వ్యర్థమన్నారు. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి విధానం బాగోలేనప్పుడు స్థానిక నాయకులు మాత్రం ఏమి చేస్తారు సరెండర్ అయిపోయి బానిసత్వం వీర వినయం ప్రదర్శించడం తప్పా అన్నారు. కేవలం జనసేన పార్టీకి ఓటు వెయ్యమని మేమేమి ఎవరికి బలవంతం చెయ్యట్లేదని ఉన్నంతలో అసెంబ్లీలో గొంతెత్తి గిరిజన సమస్యలను చెప్పగలిగే నాయకుడిని ఎంచుకోవలన్నారు. మేము జనసేనపార్టీ ద్వారా ఈ మధ్యనే కొత్తపాకలు గ్రామాన్ని సందర్శించమని ఆ గ్రామంలో యువత, గ్రామస్తులు స్వచ్ఛందంగా వచ్చి జనసేనపార్టీ లో చేరారని బలవంతం చేస్తే ఓట్లు రావని అన్నారు చుట్టపు చూపుగా వచ్చే పార్టీలంటూ మాపై నిందలు వేయడం కాదు ఎమ్మెల్యే మేడం భాగ్యలక్ష్మి, వైసీపీ ఇన్చార్జ్ గారు విశేశ్వర్రాజు చేతనైతే జనసేనపార్టీ ప్రభంజనాన్ని ఆపాలని సవాల్ చేసారు అలాగే మా పార్టీ చుట్టపు చూపు చూసే పార్టీ అన్నారు కదా ఇప్పుడు చెప్తున్నాం గిరిజన ప్రజలకు మా పార్టీ నిజంగానే చుట్టం. కానీ వైసీపీ పార్టీ మాత్రం గిరిజనులని తడిగుడ్డ తో గొంతు కోసే పార్టీ అంటూ ఎద్దేవా చేశారు త్వరలోనే ఎన్నికల్లో ని గిరిజన ప్రజలు చాప చుట్టేస్తారన్నారు.ఉపాధ్యక్షులు వంతల రాజారావు మాట్లాడుతూ పివిటిజి ప్రజలకు తీవ్ర ద్రోహం చేసిన పార్టీ వైసీపీ పార్టీ హక్కులు, చట్టాలు నిర్వీర్యం చేసి గిరిజన ప్రజలని మభ్యపెట్టడంలో ఏకైక పార్టీ అన్నారు.అలాగే అలాగే జన్ మన్ కార్యక్రమంలో పివిటిజి ప్రజల జీవన స్థితి తెలిపేందుకు రాష్ట్రపతి శ్రీమతి శ్రీ ద్రౌపది ముర్మ్ గారు ఒక విశ్లేషణ బృందాన్ని నియమిస్తే ఎక్కడ తమ అవినీతి బాగోతం బయటపడుతుందేమోనని పెయిడ్ ఆర్టిస్టులతో లేని పోనీ కల్లబొల్లి కబుర్లు ప్రధానమంత్రి గారితో చెప్పించారన్నారు. పంచాయితీ నిధులు దోచేసిన దొంగలు వైసీపీ నాయకులని ఇప్పటికి ఆంధ్రలో సర్పంచులు పరిస్తితి ఎలావుందో ప్రజలకి తెలుసన్నారు సగటు సర్పంచ్ కి నిధులు లేవు, విధులు లేవు, గ్రామాల్లో గౌరవం లేదు ఇది చాలదా వైసీపీ నిరంకుశ పాలనకు ఉదాహరణ అన్నారు. గిరిజనజాతి ద్రోహుల పార్టీ వైసీపీ గిరిజన నాయకులకు బుద్ది లేక వైసీపీ పార్టీలో కొనసాగుతున్నారు. అదే వారే గనక నిజాయితీగా గిరిజన ప్రజలకోసం ఆలోచన చేస్తే వైసీపీ బహిష్కరిస్తారన్నారు. ఈ సందర్బంగా లింగాల గుడి గ్రామస్తులు స్వచ్ఛందంగా పార్టీలో చేరారు వారికి జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారామ్, మండల ఉపాధ్యక్షులు వంతల రాజరావు పార్టీ కప్పి జనసేనపార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు గిరిజన సాధికారతపై జనసేనాని ఆలోచన విధానం తెలియజేస్తూ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వంతల శేఖర్, అశోక్, గ్రామయువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.