తెలంగాణలో కొనసాగుతున్న మినీ పురపోరు కౌంటింగ్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన మినీ పురపోరు ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటల నుంచి కొనసాగుతోంది. వరంగల్‌, ఖమ్మం నగరపాలక సంస్థలతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్‌, కొత్తూరు పురపాలక సంఘాలతో పాటు జీహెచ్‌ఎంసీలోని లింగోజిగూడ, మరో నాలుగు మున్సిపాలిటీల్లోని 4 వార్డులకు శుక్రవారం(గత నెల 30న) ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. కరోనా నెగెటివ్‌ వచ్చిన వారిని మాత్రమే కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించారు. బ్యాలెట్‌ పత్రాలతో నిర్వహించిన ఎన్నికలు కావడంతో ఫలితాల వెల్లడిలో కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఈ రాత్రికి తుదిఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.