నేడు వరంగల్‌ పర్యటనలో కేటీఆర్

మంత్రి కేటీఆర్ ఈరోజు వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భారీ వర్షాలు వరదల కారణంగా వరద ముంపు ప్రాంతాల్లో మరో మంత్రి ఈటెల రాజేందర్‌‌తో కలిసి కేటీఆర్ పర్యటించనున్నారు. స్థానిక మంత్రులతో కలిసి ఏరియల్ సర్వే చేయనున్నారు. అనంతరం ముంపు ప్రాంతాల్లో పర్యటించి…తర్వాత ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి కేటీఆర్  సమీక్ష చేయనున్నారు.