మేక్ ఇన్ ఇండియా’కు ప్రోత్సాహాన్నిఅందించిన రక్షణ మంత్రిత్వ శాఖ

‘మేక్ ఇన్ ఇండియా’కు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తూ.. భారత ప్రభుత్వపు రక్షణ రంగంలో రక్షణ మంత్రిత్వ శాఖ సముపార్జన విభాగం పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నది. భారత సైన్యం ఫిరంగి దళ రెజిమెంట్లకు ‘సిక్స్ పినాకా రెజిమెంట్ల’ సరఫరా నిమిత్తం ఎంఓడీ దాదాపుగా రూ.2580 కోట్ల ఒప్పందాల్ని కుదుర్చుకున్నది. ఒప్పందం చేసుకున్న సంస్థల్లో మెస్సర్స్ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్‌), మెస్సర్స్ టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ (టీపీసీఎల్) మెస్సర్స్‌ లార్సెన్ & టౌబ్రో (ఎల్ అండ్ టీ) ఉన్నాయి.

ఈ ‘సిక్స్ పినాకా రెజిమెంట్ల’లో 114 ఆటోమేటెడ్ గన్ ఎయిమింగ్ అండ్ పొజిషనింగ్ సిస్టమ్ (ఏజీఏపీఎస్‌) కలిగిన లాంచర్లు 45 కమాండ్ పోస్టులను మెస్సర్స్ టీపీసీఎల్ మెస్సర్స్ ఎల్ అండ్ టీ నుంచి దాదాపు 330 వాహనాలను మెస్సర్స్ బీఈఎంఎల్‌ నుంచి సమీకరించనున్నారు. ఈ ‘సిక్స్ పినాకా రెజిమెంట్లు’మన దేశపు ఉత్తర తూర్పు సరిహద్దుల్లో పని చేయనున్నాయి. ఇవి మన సాయుధ దళాల ఆపరేషన్ సంసిద్ధతను మరింత పెంచనున్నాయి. ‘సిక్స్ పినాకా రెజిమెంట్ల’ స్థాపనను 2024 నాటికి పూర్తి చేయాలని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి.

దాదాపు 70శాతం స్వదేశీ కంటెంట్‌తో కొనుగోలు (భారతీయ) వర్గీకరణ కింద.. ఈ ప్రాజెక్టును రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లు ఆమోదం తెలిపారు. పినాకా మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్‌ను (ఎంఎల్‌ఆర్‌ఎస్) మన దేశీయంగా డీఆర్‌డీఓ రూపొందించి అభివృద్ధి చేసింది. దీనిని దేశీయ రక్షణ పరిశ్రమలు ఉత్పత్తి చేస్తున్నాయి. ఇది భారత ప్రభుత్వం (డీఆర్‌డీఓఅండ్ ఎంఓడీ) ఆధ్వర్యంలో ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రదర్శించే ప్రధానమైన రక్షణ ప్రాజెక్ట్. క్షేత్రస్థాయిలో కీలకమైన అత్యాధునిక రక్షణ సాంకేతిక పరిజ్ఞానాలలో “అత్మ నిర్భర్‌”కు ఇది తగిన తోడ్పాటును అందించనున్నది.