మిథిలానగర్ జనసేన ఆత్మీయ సమావేశం

తెలంగాణ, కుత్బుల్లాపూర్ జనసేన ఇంచార్జ్ నందగిరి సతీష్ మిథిలానగర్ లో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని పార్టీ కార్యవర్గ సభ్యులకు పార్టీ ఉన్నతికి తన అమూల్యమైన సలహాలను సూచనలను తెలియచేయడం జరిగింది. సమావేశానంతరం సతీష్, మిథిలానగర్ లోని శ్రీ విజయదుర్గ అమ్మ వారిని, వేంకటేశ్వరస్వామి వారిని దర్శనం చేసుకొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో మిథిలానగర్ జనసేన సభ్యులు పాల్గొన్నారు.