ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తీరు మార్చుకోవాలి: మాదాసు నరసింహ

*జనసేన జెండా చూస్తేనే భయపడుతున్నారు
*జనసేన నాయకులు, సానుభూతిపరులపై కేసులు అక్రమం

దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తీరు మార్చుకోవాలని చిట్వేలు జనసేన నాయకులు మాదాసు నరసింహ అన్నారు. ఆయన పత్రికా ముఖంగా మాట్లాడుతూ.. 2014 నుంచి జనసేన పార్టీ అన్న పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన అభిమానంతో సోషల్ మీడియాతో పార్టీకి సేవలందిస్తున్న షేక్ అయూబ్ మరియు జనసేన పార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి ముత్యాల కళ్యాణ్ మీద అక్రమ కేసులు పెట్టడం దారుణం. షేక్ అయూబ్ సదరు వీడియోలను సోషల్ మీడియాలో ఉంచారంటూ నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం చూస్తే చట్టాన్ని ఎంతగా దుర్వినియోగం చేస్తున్నారో అర్థ మవుతోందన్నారు. షేక్ అయూబ్ మరియు ముత్యాల కళ్యాణ్ లకు తాము అండగా ఉంటామని.. చట్టబద్ధంగా ఈ అక్రమ కేసులపై పోరాడతామని.. చిట్వేలి జనసేన నాయకులు మాదాసు నరసింహ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు జనసేన జెండాలు పట్టుకొని జేజేలు కొడుతున్న వీడియోలను సోషల్ మీడియాలో అందరూ చూశారు. జనసేన చూస్తేనే భయపడుతున్న ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్.. మా పార్టీ నాయకులపై రాజకీయ కక్ష సాధింపు చర్యలతో వైసీపీ నాయకులు చేస్తున్న ఆగడాలను, దౌర్జన్యాలను జనసేన బలంగా ఎదుర్కొంటుందన్నారు. దర్శి నియోజకవర్గంలో వేణుగోపాల్ గారు తనకేదో పట్టు ఉందని చెప్పుకోవడానికే జనసేన నాయకులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడం దారుణం అని మాదాసు నరసింహ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అక్రమ కేసులు పెట్టడం మీద చూపే శ్రద్ధ ఆ నియోజకవర్గ అభివృద్ధిపై పెడితే మంచిదని హితవు పలికారు. వేణుగోపాల్ గారు తక్షణమే జనసేన నాయకులపై పెట్టించిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలన్నారు. తన తీరు మార్చుకోని పక్షంలో ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.