పవన్ కళ్యాణ్ ను సి.ఎం. చేయడమే లక్ష్యం: త్యాడ రామకృష్ణారావు(బాలు)

*ప్రతీ మెగాభిమాని జనసేనతో నడవాలి
*2019లో స్థానిక అభ్యర్థి కాకపోయినా గెలుపు కోసం శ్రమించాం
*2024లో అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తాం
*స్థానికులకే నాయకత్వం ఇవ్వాలని కోరతాం

విజయనగరం: అఖిలభారత చిరంజీవి యువత, రాష్ట్ర చిరంజీవి యువత, ఆదివారం, విజయవాడలో నిర్వహించిన మెగాభిమానుల సమావేశం జరిగిన సందర్బంగా, ఆసమావేశాన్ని ఉద్దేశించి విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు (బాలు)మంగళవారం ఉదయం స్థానిక బాలాజీ జంక్షన్ వద్దనున్న అంబేద్కర్ భవనంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్బంగా అయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతీ మెగాభిమాని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకోసం, 2024లో జనసేన గెలుపుకోసం కృషి చేయాలని పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

గత 2019లో విజయనగరంలో స్థానిక అభ్యర్థి కాకపోయినా జనసేన గెలుపుకోసం రేయింబవళ్ళు మెగాభిమానులు శ్రమించారని, 2024 లో కూడా జనసేన అభ్యర్థిగా ఎవ్వరికి ఇచ్చినా.. అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తామని, జిల్లా చిరంజీవి యువత తరుపున స్థానికులకు అవకాశాన్ని ఇవ్వమని పార్టీ అధిష్ఠానాన్ని కోరానున్నామని తెలిపారు.

మెగాభిమానుల్లో వర్గాలు ఉన్నమాట వాస్తవమేనని, స్థానిక వైస్సార్సీపీ నాయకులు వద్ద చిరంజీవి అభిమానుల ముసుగులో సినిమా టిక్కట్లకే పరిమితం అయ్యారని, వారు కూడా జనసేనలోకి రావాలని కోరారు.

ఏదిఏమైనా 2024లో రేయింబవళ్ళు పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా మెగాభిమానులంతా ఏకతాటిగా కృషిచేస్తామని అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా చిరంజీవి యువత, జనసేన నాయకులు పిడుగు సతీష్, కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, రొయ్య రాజు,నాయుడు పాల్గొన్నారు.