ముఖ్యమంత్రులకు కరోనా కట్టడికి పలు సూచనలు చేసిన మోదీ

ప్రధాని మోదీ ఆదివారం జగన్‌తోపాటు తెలంగాణ సీఎం కేసీఆర్‌ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్‌ చేసి…

దేశంలోనూ.. రాష్ట్రంలోనూ నానాటికి కరోనా కేసులు పెరిగిపోతుండడంతో.. కట్టడికి ఏం చేయాలో పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యల గురించి ఆరా తీశారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో దేశంలోనే ముందున్నామని ఈ సందర్భంగా జగన్‌ ఆయనకు తెలిపారు. క్వారంటైన్‌ సెంటర్లు, ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని.. బాధితులకు సరిపడా బెడ్లు సిద్ధం చేశామని చెప్పారు. కాగా.. దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి పెరుగుతుండడంతో మరోసారి లాక్‌డౌన్‌ విధించే అవకాశాలపైనా ఉభయులూ చర్చించినట్లు తెలిసింది. జగన్‌తోపాటు తెలంగాణ సీఎం కేసీఆర్‌ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మాట్లాడారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.