మోదీ పర్సనల్ వెబ్‌సైట్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

దేశ ప్రధానిని సైతం వదలని సైబర్ నేరగాళ్లు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్సనల్ వెబ్‌సైట్‌కు చెందిన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేశారు. హ్యాకర్ కోవిడ్ 19 రిలీఫ్ ఫండ్ కోసం డొనేషన్ కింద బిట్ కాయిన్ డిమాండ్ చేశారు. అయితే, వెంటనే ఆ హ్యాకర్ బోగస్ ట్వీట్లను డిలీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్సనల్ వెబ్‌సైట్‌కు చెందిన ట్విట్టర్ అకౌంట్‌పై క్రిప్టో కరెన్సీతో ముడిపెడుతూ ట్వీట్ వచ్చింది. ట్విట్టర్ అకౌంట్‌లో ఒక మెసేజ్ వచ్చింది. దానిలో కోవిడ్ 19 కోసం ఏర్పాటు చేసిన పీఎం మోదీ రిలీఫ్ ఫండ్‌కు డొనేట్ చేయాలని కొంత సొమ్మును పంపాలంటూ కోరారు. మోదీ ట్విట్టర్ అకౌంట్‌ జాన్ విక్ పేరుతో హ్యాక్ అయ్యింది. ఈ హ్యాకర్ గ్రూప్ పేరు జాన్ విక్. ఈ గ్రూప్ కు పేటీఎం మాల్ డేటా చోరీ కేసులో హస్తముందనే ఆరోపణలున్నాయి. పేటీఎం మాల్ యూనిఫార్మ్ అనేది పేటీఎంకు చెందిన ఈ కామర్స్ కంపెనీ. కాగా, ప్రధాని ట్విట్టర్ అకౌంట్‌కు 25 లక్షలకు మించిన ఫాలోవర్లు ఉన్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర సైబర్ క్రైం విభాగం దర్యాప్తు చేపట్టింది.