పాలకొండ నియోజకవర్గం రోడ్లకు మోక్షం ఎప్పుడో?

  • పాలకొండ నియోజకవర్గ జనసేన, టీడీపీల ఆధ్వర్యంలో రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్

పాలకొండ నియోకవర్గం: జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కార్యక్రమంలో భాగంగా పాలకొండ నియోకవర్గంలో ఆదివారం రోడ్ల పరిస్థితిపై డిజిటల్ క్యాంపైనింగ్ నిర్వహించడం జరిగింది. పాలకొండ మండలంలో గల పాలకొండ నుంచి లూంబూరు మరియు ఓని రహదారులు పరిశీలించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు, సమన్వయ కర్త నిమ్మల నిబ్రహం, తెలుగుదేశం నియోజకవర్గ ఇంచార్జీ నిమ్మక జయకృష్ణ మరియు కూరంగి నాగేశ్వర్రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా రోడ్లంతా గుంతలమయం, రోడ్ల పైన సామాన్యుల ప్రయాణించడానికి భయపడుతున్నారు. 2021 నవంబర్ కి రోడ్ల మరమ్మతులు చేపడతామని చెప్పిన జగన్ రెడ్డి ఇప్పటికి రోడ్డును కూడా బాగు చేయలేకపోయారు. రోడ్లు అధ్వాన పరిస్థితి గురించి దుయ్యబట్టారు. గాలిలో తిరిగే ముఖ్యమంత్రికి రోడ్లపైన నడిచే సామాన్యుల యొక్క బాధలు పట్టడం లేదని, మంత్రులు ప్రతిపక్షలపై విమర్శలు, భూతులు మాట్లాడడం తప్పితే ఎవరరిది ఏ శాఖో తెలియని పరిస్థితి, మరో నాలుగు నెలల్లో ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన 6నెలల్లోనే రోడ్లు మరమ్మతులు చేపడతామని తెలియజేశారు.