జనసేన ఫిర్యాదుతో ప్రజా సమస్యలపై స్పందించిన మూలగుంటపాడు సర్పంచ్

కొండెపి: మూలగుంటపాడు గ్రామ సభలో సోమవారం విద్యానగర్ ఎనిమిదో లైనుకు ఎదురుగా అడ్డరోడ్లు, ఒకటో లైన్, రెండో లైను, మూడో లైను, నాలుగో లైనులలో రోడ్డు డ్రైనేజీ లేక ప్రజల పడుతున్న ఇబ్బందులను జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ ములగుంటపాడు గ్రామ సర్పంచ్ డాక్టర్ శివరామిరెడ్డికి సమస్యలను వివరించడం జరిగినది. వెంటనే స్పందించిన సర్పంచ్ శివరామిరెడ్డి మంగళవారం మూలగుంటపాడు విద్యానగర్ నందు పర్యటించి ఆ ప్రజల సమస్యలను తెలుసుకొని, వెంటనే సర్వే చేయించి, రోడ్డు నిర్మాణం చేపట్టానికి కృషి చేస్తానని ఆ ప్రాంతవాసులకి హామీ ఇవ్వడం జరిగినది. స్పందించిన సర్పంచ్ కు ప్రజల తరఫున మరియు జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తొందరగా రోడ్డు నిర్మాణం చేపట్టగలరని ప్రజల సమస్యలను వెంటనే తీరుస్తారని, మీ మీద నమ్మకం ఉంచడం అయినది అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ములగుంటపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శి నజీర్, జనసేన పార్టీ నాయకులు, మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.