ఎమ్మెల్యే అనంత వెంకట్రాంరెడ్డి సారు.. ప్రజా సమస్యలు మీకు పట్టవా?

రాజీవ్ కాలనీ పంచాయతీలో పొట్టి శ్రీరాములు కాలనీ మరియు రామయ్య కాలనీ ప్రజల నివాసాల పైన 33 కేవీ లైన్ మార్చమని గత కొన్ని సంవత్సరాల నుండి కాలనీ ప్రజలు మీకు విద్యుత్ శాఖ వారికి ఎన్ని మార్లు మొరపెట్టుకున్న పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదేనా! ప్రజల సమస్యల పైన మీకున్న చిత్తశుద్ధి?, కేవలం గొప్పలు చెప్పుకొని పబ్లిసిటీ చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రాంరెడ్డిని ఉద్దేశించి అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రాంత ప్రజలు నివసిస్తున్న గృహాల పైన చెయ్యి ఎత్తితే తగిలేంత ఎత్తులో 33 కేవీ లైన్ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రమాదాలు జరుగుతున్నాయి, వర్షం వస్తే ఈ ప్రాంత ప్రజలందరూ అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెలబుచ్చుతున్నారు. ఇంక మీ వల్ల ఈ సమస్య తీరదని? మీరు ఈ ప్రాంత ప్రజలను పట్టించుకునే పరిస్థితులలో లేరని కాలనీ ప్రజలకు అర్థమైందంటూ.. ఈ సమస్యపై సోమవారం కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లి “స్పందన” కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కు తక్షణమే 33 కేవీ లైన్లు మార్చమని రాజీవ్ కాలనీ పంచాయతీ ప్రజలు జనసేన జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, జనసేన నాయకులు పాలగిరి చరణ్ తేజ్, భవాని నగర్ మంజునాథ్, ప్రవీణ్ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు వెళ్లి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎమ్మెల్యే సారు తక్షణమే మీరు స్పందించి, త్వరితగతిన సమస్యను పరిష్కరించకుంటే రాజీవ్ కాలనీ పంచాయతీ ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీస్తామని ఈ సందర్భంగా తెలియజేసారు.