స్వామి వివేకానంద యువతరానికో హీరో :శ్రీనివాస్ భరత్ జైహింద్

స్వామీ వివేకానంద యువతరానికి ఓ హీరో అని, ఆయనని ఆదర్శంగా తీసుకుని జాతీయ వాదులుగా తయారయ్యాం అని ఆత్మకూర్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ భరత్ జైహింద్ అన్నారు. జనసేన పార్టీ అనంత సాగరం మండల ప్రధాన కార్యదర్శి కానగల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన స్వామి వివేకానంద జయంతిలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రదాన కార్యదర్శిలు వేణు గుడిపాటి, ఉపాధ్యక్షుడు కృష్ణ మూర్తి యాదవ్, కార్యనిర్వాహక కార్యదర్శిలు వెంకటేష్ ముదిరాజ్, వంశీ కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.