క్రియాశీలక సభ్యత్వ ఇన్సూరెన్స్ చెక్కులను అందజేసిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

  • సీతానగరం మండలంలో క్రియాశీలక సభ్యత్వ ఇన్సూరెన్స్ చెక్కుల అందజేత

రాజానగరం, సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామంలో జనసైనికుడు బాకూరి సూర్యారావు జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఇటీవల ఆయన హఠాన్మరణంతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగి ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయామని బాధపడుతున్న ఆ కుటుంబానికి జనసేన పార్టీ అండగా నిలిచింది. అలాగే సీతానగరం మండలం సింగవరం గ్రామంలో జనసైనికుడు బర్ల వెంకటరావు జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఇటీవల ఆయన హఠాన్మరణంతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగి ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయామని బాధపడుతున్న ఆ కుటుంబానికి జనసేన పార్టీ అండగా నిలిచింది. ఇరువురి కుటుంబసభ్యులకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కుటుంబసభ్యుల భద్రతకై ప్రవేశపెట్టిన క్రియాశీలక సభ్యత్వ ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయల చెక్కులను శనివారం వారి కుటుంబాలకు అందజేసి జనసేన పార్టీ ఎల్లవేళలా తోడుంటుందని భరోసా కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

  • రాజానగరం మండలంలో క్రియాశీలక సభ్యత్వ ఇన్సూరెన్స్ చెక్కుల అందజేత

రాజానగరం మండలం, భూపాలపట్నం గ్రామంలో జనసైనికుడు పంతం శ్రీనివాస్ గారు జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు… ఇటీవల ఆయన హఠాన్మరణంతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగి ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయామని బాధపడుతున్న ఆ కుటుంబానికి జనసేన పార్టీ అండగా నిలిచింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కుటుంబసభ్యుల భద్రతకై చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ ఇన్సూరెన్స్ ను పంతం శ్రీనివాస్ చేయించుకున్నారు. శనివారం వారి కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లవేళలా తోడుంటుందని భరోసా కల్పిస్తూ క్రియాశీలక సభ్యత్వ ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.