నిడిగట్ల గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, నిడిగట్ల గ్రామంలో సోమవారం పలు కుటుంబాలను జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ సభ్యురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించారు. ముందుగా నిడిగట్ల గ్రామానికి చెందిన కోరాడ అజయ్ ఇటీవల ప్రమాదంలో చనిపోయిన విషయం తెలుసుకొని నేడు వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోదైర్యం చెప్పడం జరిగింది. అదే గ్రామానికి చెందిన దేవిరెడ్డి శ్రీను అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని వారిని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అదే గ్రామానికి చెందిన కుంచె సూర్యారావు గారు ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలుసుకుని నేడు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మరో దైర్యం తెలియజేశారు. అదే గ్రామానికి చెందిన బి.పెద్ద సూర్యుడు ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలుసుకుని నేడు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మరో దైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.