అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన ముమ్మారెడ్డి

కూకట్ పల్లి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భముగా బుధవారము ఉదయం కేపీహెచ్ బి కాలనీ 5వ ఫేస్ జనసేన పార్టీ ఆఫీస్ లో అంబేద్కర్ పటమునకు, కెపిహెచ్బి కాలనీ ఫోర్త్ ఫేస్ అంబేద్కర్ విగ్రహమునకు, మూసాపేట్ వై జంక్షన్ అంబేద్కర్ విగ్రహమునకు, బాలానగర్ బస్ స్టాప్ వద్దగల అంబేద్కర్ విగ్రహమునకు మరియు ఓల్డ్ బోయిన్పల్లి అస్మత్ పెట్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహమునకు పూలమాలవేసి కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముమ్మా రెడ్డి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ హక్కులనేతని ఓటు హక్కు ద్వారా దేశంలో రాజకీయ సమానత్వం కోసం కృషి చేసిన వ్యక్తి అని ఆయన రాసిన రాజ్యాంగం ప్రతి పౌరునికి జీవితాన్ని ఇస్తుందని, న్యాయ శాస్త్ర మంత్రిగా ఉంటూ స్త్రీలకు హక్కులకై పోరాడిన వ్యక్తి అని, అన్నివర్గాల ప్రజల యొక్క ఆకాంక్షలురాజ్యాంగం లో చేర్చి రాజ్యాంగ పితగా పేరుపొందాడని. అలాంటి వ్యక్తి స్ఫూర్తితో మా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను మరియు మా జనసైనికులు వీరమహిళల్లో జనసేన పార్టీ సిద్ధాంతంలో ఒకటైన కుల మతాల ప్రస్తావ లేకుండా ప్రజాసేవలు చేసుకుంటా అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మండల దయాకర్, కొల్లా శంకర్, వెంకటేశ్వరరావు, వేముల మహేష్, గడ్డం కిషోర్ నాగరాజ్, నాగేంద్ర, కే .లక్ష్మణరావు, కలిగినీడి ప్రసాద్, జన్ని సునీల్, అన్నపురెడ్డి వెంకటస్వామి, మధు, యోగేష్, హరీష్, వీరమహిళలు మహాలక్ష్మి, ముంతాజ్, లక్ష్మీ మరియు నియోజకవర్గ జనసేనలో వీరమహిళలు పాల్గొన్నారు.