ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన విస్తృత స్థాయి సమావేశం

ముమ్మిడివరం నియోజకవర్గం: ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ముమ్మిడివరం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు ఇచ్చిన పిలుపుమేరకు ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరంలో నిరాహార దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, తెలుగుదేశం నాయకులకు పితాని బాలకృష్ణ, జనసేన శ్రేణులు అందరూ ర్యాలీగా వెళ్లి సంఘీభావం తెలియజేశారు. వారందరికీ ధైర్యం ఇచ్చి భవిష్యత్తులో ఇరు పార్టీలు కలిసి పోరాటం చేసే దిశగా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కేసు నుండి విముక్తి చేసే వరకు పోరాడతామని ఇరు పార్టీలు నిర్ణయం తీసుకోవడం అయినది అనంతరం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), ఉభయగోదావరి జిల్లాల మహిళా కన్వీనర్ ముత్యాల జయలక్ష్మి, ముమ్మిడివరం మండల అధ్యక్షులు గొలకోటి వెంకటేశ్వరరావు, ముమ్మిడివరం నగర పంచాయితీ అధ్యక్షులు కడలి వెంకటేశ్వరరావు( కొండ), కాట్రేనికోన మండల అధ్యక్షులు మోకా బాల ప్రసాద్, ఐ పోలవరం మండల అధ్యక్షులు మద్దింశెట్టి పురుషోత్తం, తాళ్లరేవు మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు గుద్దటి రమా కేశవ బాలకృష్ణ (జమి), గోదాసి పుండరీష్, ఉప్పూడి సర్పంచ్ రంబాల రమేష్, జి వేమవరం సర్పంచ్ పుణ్యవతుల సూరిబాబు, తిల్లకుప్ప ఎంపీటీసీ ఉండ్రు సత్యనారాయణ, వేమవరం ఎంపీటీసీ లంకెలపల్లి జమి మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదంచేశారు.