రోడ్లు మరమ్మత్తులు చేయండి: గుడివాడ జనసైనికులు

గుడివాడ నియోజకవర్గం : గుడివాడపట్టణ మున్సిపల్ రోడ్లను మరమ్మత్తులు చేయాలని శనివారం గుడివాడ పట్టణ జనసైనికులు మున్సిపల్ అధికారులకు తెలియజేసారు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ బస్టాండ్ ఇన్ గేట్ ఎదురు రోడ్డులో కిన్నెర కాంప్లెక్స్ ముందు రోడ్డు పై గుంటలు పడి వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ అవుతుంది. వచ్చే రోజుల్లో భీమవరం గేటు మీద ఫ్లై వోవర్ నిర్మాణ సమయంలో ఈ రోడ్డు ప్రాముఖ్యత పెరుగుతుంది ట్రాఫిక్ ఇటు వైపు మళ్ళించే అవకాశం ఉంది కాబట్టి ఈ రోడ్డు పై గుంటలను పూడ్చి ఆక్రమణలు తొలగించాలని మున్సిపల్ అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నూనె అయ్యప్ప, కిరణ్, శివ, చరణ్ పాల్గొన్నారు.