హిందూ స్మశాన వాటిక కోసం పోరాడుతున్న ముస్లిం మైనారిటీ జనసేన నాయకులు

గత నెల రోజుల నుండి పుట్టపర్తి పట్టణంలోన హిందూ స్మశాన వాటికలో గోరీలను తొలగించి అక్కడ వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనం ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించుకున్న ఎమెల్యే దుద్దకుంట శ్రీధర్ రెడ్డికి చుక్కెదురయింది. హెల్త్ క్లినిక్ స్మశాన వాటికలో కాకుండ వేరే మరొక చోట ఏర్పాటు చెయ్యాలని పట్టణ అఖిలపక్ష నాయకులతో పాటు జనసేన పార్టీ నాయకులు కూడా ఉద్యమాలలో ప్రధాన పాత్ర పోసించారు. ఈ ఉద్యమంలో “హిందూ స్మశానవాటిక పరిరక్షణ” కోసం జనసేన పార్టీ ముస్లిం మైనారిటీ నాయకుడి గళం ప్రత్యేకంగా నిలిచింది. స్థానిక ఎమెల్యే పోలీసు బలగాలతో పట్టణ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి నిరసనలు చెయ్యకుండ ఆంక్షలు విధిస్తు అక్రమంగ భవన నిర్మాణం చేపట్టారు. ఇందుకు ఉద్యమకారులు హైకోర్టును ఆశ్రయించి “స్టెటెస్కో” ద్వారా అక్రమ కట్టడం నిలిచేటట్టు చేసారు. అబ్ధుల్ అబు మట్లాడుతూ“… మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు.. మీరు తీసుకునే అనాలోచిత నిర్మాణాలకు, పనులకు వ్యతిరేకం. పుట్టపర్తి అభివృద్ధి కోసం జనసేన పార్టీ నిత్యం పోరాడుతూనే ఉంటాం.“ అన్నారు. ఈ ఉద్యమంలో అఖిలపక్ష నాయకులతో పాటు జనసేన పార్టీ నాయకులు అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి “అబ్ధుల్ అబు”, జిల్లా కార్యదర్శి బొగ్గరం శ్రీనివాసులు, డా.తిరుపతేంద్ర, బోయ వంశీ, తలారి పెద్దన, పవన్ మరియు సాయి ప్రభు తదితరులు పాల్గొన్నారు.