బొర్రా అధ్వర్యంలో ముస్లిం, మైనార్టీ ఆత్మీయ సమావేశం

సత్తెనపల్లిలో బొర్రా అధ్వర్యంలో జరిగిన ముస్లిం, మైనార్టీ ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ జిలానీ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొర్రా మాట్లాడుతూ జనసేన ప్రభుత్వంలో వెనుక బడ్డ ముస్లింల జీవన విధానాన్ని మెరుగు పరుస్తామని బొర్రా తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడు పద్మభూషణ్ వావిలాల గోపాల కృష్ణయ్య, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్ఫూర్తితో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగిందన్న బొర్రా తెలిపారు మీరు కోరుకున్న మార్పు కోసం జనసేన పార్టీని నమ్మండి. జనసేన పార్టీ మ్యానిఫెస్టోలో సచార్ కమిటీ సూచనలు పరిగణలోకి తీసుకుంటాం. 5వ తరగతి వరకు ఉర్దూలో చదువుకోవడం మీ హక్కు. బాధ్యతగల ప్రభుత్వంగా ముస్లిం మైనారిటీ సోదరుల అభ్యున్నతికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ ప్రభుత్వంలో అవినీతి, కబ్జాలు పెరిగిపోయాయి. ముఖ్యమంత్రి తన కోసం రూల్స్ మొత్తం ఇష్టానుసారం మార్చేశాడు జగన్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వం ముస్లిం సోదరుల హక్కులు కాలరాస్తోంది. పింఛన్లు ఎత్తేశారు, శ్మశానాలు ఆక్రమించేశారు. ప్రతి మున్సిపాలిటీలో ఉర్దూ పాఠశాల ఉండేది,అవీ కనబడడం లేదు. రేపు జనసేన అధికారంలోకి వస్తే ప్రజా ప్రభుత్వంలో ఇంకెంత అండగా ఉంటుందో ఆలోచించండి. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఉర్దూ మీడియంను మళ్లీ తీసుకొస్తాం.రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం ప్రతినిధులకు ఇఫ్తార్ ఇవ్వడంతో పాటు ఇస్లాం విద్య, ధార్మిక సంస్థల అభివృద్ధికి రూ.25 లక్షలు విరాళం పవన్ కళ్యాణ్ ఇచ్చారు.గత ఎన్నికల్లో ముస్లింలు వైసీపీని పూర్తిగా నమ్మారు.. మద్దతు ఇచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా, ఉపాధి అవకాశాలు పెరిగేలా చర్యలు తీసుకుంటామని, ముస్లింల భద్రత, గౌరవానికి ఏ మాత్రం భంగం వాటిల్లకుండా జనసేన పార్టీ చూసుకుంటుందని బొర్రా అప్పారావు అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యదర్శి సయ్యద్ జిలాని, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమిశెట్టి సాంబశివరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి ఖాసిం సైదా, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు దూదేకుల సలీం, నరసరావుపేట నియోజకవర్గ ప్రతినిధి షేక్ అద్రుఫ్, సత్తెనపల్లి ఏదో వార్డ్ కౌన్సిలర్ రంగశెట్టి సమన్, జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు బత్తుల కేశవసత్తెనపల్లి మండల అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరరావు, నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి, నరసరావుపేట పట్టణ అధ్యక్షుడు ప్రసాద్, నకరికల్లు మండల ఉపాధ్యక్షుడు షేక్ రఫీ, షేక్ మదర్, షేక్ సైదా, షేక్ బాజీ, జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.