అంబేద్కర్ ను అవమానించినందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదు: జనసేన జానీ

పాలకొండ నియోజకవర్గం జనసేన జానీ మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన ఎంతటి హీనంగా ఉన్నది అనేదానికి శుక్రవారం ఒక ఉదాహరణ సంఘటన చోటుచేసుకుంది.. కొత్తపేట నియోజకవర్గంలో గోపాలపురం గ్రామంలో కొంతమంది యువత ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి వెళ్ళి నూడిల్స్ తినడానికి వెళ్ళితే.. అక్కడ-కాగితం ప్లేట్ లో అంబేద్కర్ గారు చిత్రం ముద్రించి హా ప్లేట్ లో నూడిల్స్ వెయ్యడం తప్పు అని అడిగితే 18మంది యువకులని నాన్ బెయిల్ బుల్ సెక్షన్లతో కేసులు పెట్టడం చాలా తప్పు.. భారతదేశ 140 కోట్ల మంది భారతీయులు ఈ సంఘటనను తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఈ సమస్యను వేగంగా పరిష్కరించకపోతే అన్ని కులస్తులు నుంచి అన్ని పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. దాని తరువాత జరిగే సంఘటనలకు పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.. హిందువు దేవాలయాలు కూల్చి.. క్రిస్టియన్స్ కి హిందువులు కి మధ్య మత గొడవలు పెడతారు.. అంబేద్కర్ గారిని అవమానించి ప్రజలు మధ్య పార్టీ ల మధ్య గొడవలు సృష్టించి దీనికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ భారీ మూల్యం చెల్లించక తప్పదు అని జనసేన జానీ సూటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.