ఘనంగా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం

రాజంపేట, సైకో ప్రభుత్వం పోవాలి ప్రజా ప్రభుత్వం రావాలని జనసేన నేతలు యల్లటూరు శ్రీనివాసరాజు, మలినీడి తిరుమల రావు(బాబీ)లు అన్నారు. శుక్రవారం నందలూరు మండలంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొని ప్రసంగించారు. ముందుగా నాగిరెడ్డిపల్లి మారమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నాగిరెడ్డిపల్లి వీధుల గుండా ర్యాలీగా బయలుదేరి ప్రజలకు అభివాధం చేస్తూ పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ పార్టీ కార్యాలయం వరకు చేరుకుని పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ర్యాలీ సందర్భంగా స్థానిక మహిళలు నాయకులకు హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రస్తుత సైకో ప్రభుత్వం తుగ్లక్ పాలనను తలపిస్తుందని వారు ఎద్దేవా చేశారు. సైకో ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ప్రతి ఒక్కరిలో మార్పు వచ్చిందని వచ్చే ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుందని మంచి రోజులు రాబోతున్నాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో పాటు రాజంపేట నియోజకవర్గ నేత యల్లటూరు శ్రీనివాసరాజు జనసేన తరఫున వచ్చే ఎన్నికల్లో విజయ దుందుభి మోగించడం ఖాయమన్నారు. అనంతరం దాదాపు 200 కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, మాజీ జెడ్పిటిసి యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, కుప్పాల జ్యోతి, కత్తి నరసింహులు,శరత్ బాబు, మాజీ ఎంపిటిసి చల్ల నాగేంద్ర,ఆకుల చలపతి గురివిగారి వాసు, భారతాల ప్రశాంత్, తిప్పాయిపల్లి ప్రశాంత్, కట్ట మల్లికార్జున, టిడిపి నాయకులు చామంతి పెంచలయ్య, తోట శివశంకర్, కానకుర్తి వెంకటయ్య, తుంటి రమణయ్య కుర్రమని నువ్వుల రమణయ్య, ఎన్నారై రమణ,భాస్కర్, మడంపల్లి నారాయణ, పామురు వెంకటేష్, రాజంపేట జనసేన నేతలు నాసర్ ఖాన్, పివిఆర్ కుమార్, మౌలా, పత్తి నారాయణ, కట్టారు బాబు, చిట్టి భాస్కర్, రాజాచారి నందలూరు జనసేన యువత షేక్ బాషా, షాకీర్, ఈశ్వర్, లక్ష్మీనారాయణ, సుబ్బు, దినేష్, కిట్టయ్య, విష్ణు, హరి మండలంలోని జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.