ఓటరు నమోదులో జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నించిన ముత్తా

కాకినాడ సిటిలో జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నేతృత్వంలో 39వ డివిజన్ నాయకులు ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 39వ డివిజన్లోని సచివాలయానికి వెళ్ళి ఓటరు నమోదులో జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడంలో ఈ వై.ఎస్.ఆర్ ప్రభుత్వం ఎంత దిగజారుతుందో తెలుస్తోందన్నారు. దీప్తి అనే ఆమె తమ పార్టీ వీరమహిళ అనీ ఈవిడ అనేక ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజా చైతన్యానికి తనవంతు కృషి చేస్తుంటారనీ అలాంటిది ఈవిడ ఓటునే తొలగించారనీ, తాను, ఆకుల శ్రీనివాస్ తదితరులందరం ఇదే డివిజనులో నివసిస్తున్నామనీ ఈ డివిజనులో సుమారు 54 ఓట్లను తొలగించివేసారని తాము అనుమతించిన కాలపరిమితిలోనే వాటిని ఆన్లైనులో అప్లోడు చేయడం జరిగిందనీ, సచివాలయంలో అడిగితే మీ డివిజనులో 5గురు బి.ఎల్.ఓ లు ఉన్నారు వారికి వీటిని ఇచ్చామని చెపుతూ ఎవరికిచ్చారో చెప్పకుండా తిప్పుతున్నారనీ కారణం 1500 ఓటర్లు దాటితే వేరే పోలింగ్ బూతుకి మార్చామనే కారణం చెపుతూ తిప్పుతున్నారు దీనివలన దీప్తి అనే ఈమె ఓటుకే ఎసరు వచ్చిందన్నారు. ఇందాకటినుండీ తాము ప్రయత్నిస్తుంటే ఆన్లైను పోర్టల్ పనిచేయట్లేదు, 12 వ తారీకు వరకు పరిమితి పెంచిన విధానం, 31వ తేదీతో ఆగిపోయింది బి.ఏ.ఓల మొబైల్ ఫోన్లు పనిచేయట్లేదు మాన్యువల్గా చేసుకోమంటున్నారన్నారు. ప్రభుత్వం 12వ తారీఖువరకు కరక్షన్లకు గడువు ఇచ్చినా వీళ్ళు ఈవేళ ఆఖరు అని, కారణం 7 రోజులు గ్రేస్ పీరియడ్ ఉంటాదని ఈవేళ సాయంత్రం దాటితే ఆ గ్రేస్పీరియడ్ కూడా రాదు అని చెప్పి హడావుడిగా వీళ్ళందరూ చేస్తున్న విన్యాసం చూస్తుంటే బాధవేస్తొందన్నారు. జనసేన పార్టీ అని చెప్పి వీరమహిళ ఓటుని తోగించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత, చంద్రశేఖర్ రెడ్డి పాత్ర ఎంత, వీళ్ళు ప్రభావితం చేసిన అధికారుల పాత్ర ఎంత అని ప్రశ్నించారు. ఇలాగ కాకినాడలోని వీరమహిళలవీ, జనసైనికులవీ చాలా పెద్దమొత్తంలో ఓట్లు తీసేస్తున్నారని ఆరోపించారు. వీటిని సరిదిద్దకపోతే తాము తీవ్రంగా పరిగణిస్తామనీ పదవులు శాశ్వతం కాదనీ, అధికారులకి మీరు ఉద్యోగస్తులు అనీ మా మొబైల్ ఫోనులు పనిచేయట్లేదు, ఈవేళతో అయిపొయిందని చెప్పడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోండని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు ఆకుల స్రీనివాస్, వాసిరెడ్డి సత్యకుమార్, కోటేశ్వరరావు, మోహన్, బ్రహ్మాజీ, బండి సుజాత, సభ్య దీప్తి, ఉమా, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.