సామాజిక చైతన్య యాత్రలో పాల్గొన్న ముత్తా శశిధర్

కాకినాడ సిటిలోని ఫ్రేజరుపేట ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ఆలోచనా స్ఫూర్తితో సామాజిక చైతన్య యాత్ర కార్యక్రమం సాయంత్రం 5.30 గంటలకు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య నేతృత్వంలో చీకట్ల వాసు, సాధనాల గంగాధర్ మరియు సిటి సహాయ కార్యదర్శి శ్రీమతి మిరియాల హైమావతిల సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య మాట్లాడుతూ తమ నాయకుడు పవన్ కళ్యాణ్ మనుషులంతా సమానం అని నమ్ముతారనీ, పేదలు సమాజంలో అభివృద్ధి చేందాలని తపిస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాలు విద్య, వ్యాపారాలలో అభివృద్ధి పధంలో నిలవాలని కోరుకుంటున్నారని ప్రజలకు వివరించారు. ఈ వై.సి.పి ప్రభుత్వ హయాములో బలహీన వర్గాల వారు ఆర్ధికంగా బలపడితే తమ ఆటలు సాగవని అణగదొక్కే ధోరణి అవలంబిస్తోందని దునుమాడారు. ప్రజలు ఈవిషయాన్ని గమనించవలసినదిగా కోరారు. ప్రజలతో మాట్లాడుతూ ఈ ప్రజా వ్యతిరేక విధానాలని వివరించి చైతన్యం తీసుకురావాలని ఈ సామాజిక చైతన్య యాత్ర జనసేన పార్టీ చేపట్టిందన్నారు. ఈ సామాజిక చైతన్య యాత్రలో కాకినాడ సిటి జనసేన పార్టీ ఇంచార్జ్ & పి.ఏ.సి సభ్యులు ముత్తా శశిధర్ పాల్గొని పార్టీ శ్రేణులని అభినందించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటి జనసేన పార్టీ అధ్యక్షులు సంగిశెట్టి అశోక్, ఫణీంద్ర, బలసాడి శ్రీను, ఎసేబు, మండపాక దుర్గాప్రసాద్, వీరమహిళలు పావని, మాలతి, జమున, మాధవి మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.