ముద్రబోయినతో ముత్యాల కామేష్ భేటీ

నూజివీడు నియోజకవర్గం: నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు ముద్రబోయిన వెంకటేశ్వరరావుతో నూజివీడు నియోజకవర్గ జనసేన ముఖ్య నాయకులు ముత్యాల కామేష్ మర్యాదపూర్వకంగా వారి కార్యాలయంలో భేటీ అయ్యారు.
నూజివీడు నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం కూటమి ఏ విధంగా ముందుకు వెళ్లాలి, నూజివీడు నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై ఐక్య పోరాటాలు ఏ విధంగా నిర్వహించాలి, జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలి, ఉభయ పార్టీల భవిష్యత్ కార్యాచరణ పై చర్చించినారు. త్వరలోనే నూజివీడులో జనసేన తెలుగుదేశం ముఖ్య నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బలంగా ప్రశ్నిచాలని రెండు పార్టీలు నాయకులు నిర్ణయించారు.