బావిరెడ్డి మధుసూదన్ రావు ఆత్మకు శాంతి చేకూరాలి: గాదె

ప్రత్తిపాడు నియోజకవర్గం, ప్రత్తిపాడు మండలం, వంగిపురం గ్రామంలో మన పార్టీ విధేయుడు జనసైనికుడు బావిరెడ్డి రవికిరణ్ తండ్రి బావిరెడ్డి మధుసూదన్ రావు అనారోగ్య కారణాలతో కాలం చేసి ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మాణిక్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు రామచంద్ర ప్రసాద్, జిల్లా సంయుక్త కార్యదర్శి చట్టాల త్రినాథ్, జిల్లా నాయకులు కొర్రపాటి నాగేశ్వరావు, నగర నాయకులు మధులాల్, నెల్లూరు రాజేష్, తన్నీరు గంగరాజు, గోపిశెట్టి సాయి, ప్రత్తిపాడు మండల అధ్యక్షులు మక్కే సురేష్, వంగిపురం నాయకులు గాండ్ల నరసింహారావు, పుప్పాల రామ్మోహన్ రావు, శెట్టి సాంబశివరావు, పుప్పాల శ్రీనివాసరావు మరియు గ్రామ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.