నా 37 ఏళ్ల కల తీరింది: పిటి ఉషా

న్యూఢిల్లీ : టోక్యో ఒలింపిక్స్‌లో అథ్లెట్స్‌లో పతకం గెలవాలన్న శతాబ్ద కాలం నాటి భారత కలలను నీరజ్‌ చోప్రా నిజం చేశారు. జావెలిన్‌త్రో ఏకంగా స్వర్ణమే గెలిచి..భారత ప్రజలను ఆనందోత్సోవల్లో ముంచేశారు. ఈ 23 ఏళ్ల యువకుడిపై భారతదేశ నలుమూలల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. అభినందనలు వెల్లువలా వస్తున్నాయి. అందులో మాజీ అథ్లెట్‌ పరుగుల రాణి పిటి ఉషా కూడా ఉన్నారు. ‘పయ్యాలీ ఎక్స్‌ప్రెస్‌’గా పిలిచే పిటి ఉషా 1984లో లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో 400 హరల్డ్స్‌లో తృటిలో పతకాన్ని చేజార్చుకున్నారు. ఇప్పుడు నీరజ్‌ గెలుపును …తన గెలుపుగా భావించి…ఈ ఆనందంలో పాలు పంచుకున్నారు. ‘నా 37 ఏళ్ల కళ, ఇన్నాళ్లకు తీరింది… థ్యాంక్యూ మై సన్‌ నీరజ్‌ చోప్రా’ అంటూ నీరజ్‌తో దిగిన ఫోటోను ట్వీట్‌ చేశారు.