నా ఎజెండా జనసేన జెండా రాజనగరం నియోజకవర్గంలో రెపరెపలాడాలి

  • దానికోసం నా ప్రాణ త్యాగానికైనా వెనకాడను
  • బత్తు‌ల బలరామకృష్ణ

రాజనగరం, కోరుకొండలో ఏర్పాటు చేసిన రాజానగరం నియోజకవర్గ జనసేన శ్రేణుల విస్తృత స్థాయి సమావేశంలో రాజానగరం నియోజకవర్గం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ వేదిక మీద ఉన్న నాయకులకు, కార్యక్రమానికి హాజరైన నాయకులకు, జనసైనికులకు, అభివాదం తెలియజేస్తూ… సమావేశం ఏర్పాటు ముఖ్య ఉద్దేశాన్ని తెలుపుతూ… ఆయన ప్రసంగాన్ని ఆరంభించారు. బత్తుల జనసేన పార్టీ కోసం ఎవరు ఎంత పని చేస్తున్నారన్నది ప్రతీదీ రికార్డు అవుతుంది. రాబోయే రోజుల్లో కమిటీ ఏర్పాట్లు జరుగుతాయి. ముందు జనసైనికులు కష్టపడండి, కష్టపడే కార్యకర్తలను పార్టీ గుర్తిస్తుంది. కొంతమంది మేము ప్రజారాజ్యం నుంచి ఉన్నాము పార్టీకి సేవ చేస్తున్నాము అంటున్నారు మీరు సేవ చేయట్లేదు అని మేము అనలేదు. చేసే పనిలో పట్టుదల, అహర్నిశలు కష్టపడే తత్వం, అకుంఠిత దీక్ష ఉండాలి. మీ పనితనం మాటల్లో కాదు చేతల్లో చూపించండి. పది సంవత్సరాలుగా ఉన్నాం, ప్రజారాజ్యం నుంచి ఉన్నాం అని లెక్క పెట్టకండి మీరు కష్టపడండి నేను కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాను. జనసైనికులు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కొంతమంది ప్రత్యర్ధులు మనలో కలిసిపోయి జనసేన కార్యకర్తలంటూ చేరి మనల్ని విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళ వాళ్ల ఎజెండా జనసేన ఓటమి, వాళ్ళని తిప్పికొట్టాల్సింది మనలో ఉన్న ఐకమత్యం, వాళ్లు చేసే చర్యకి ప్రతి చర్యను మనం ఐకమత్యంగా ఎదుర్కొన్నప్పుడే వాళ్లు ఇంకొక్కసారి అటువంటి దుస్సాహసాలు చేయలేరు. నేనైనా గురుదత్త ప్రసాద్ అయినా పవన్ కళ్యాణ్ కోసమే పనిచేస్తున్నాం. అపోహలుకు తావులేకుండా ఒక్కటే చెప్తున్నాను నా ఎజెండా జనసేన జెండా రాజనగరం నియోజకవర్గంలో రెపరెపరలాడాలి, దానికోసం ఎంతైనా చేస్తా అందుకు నా ప్రాణ త్యాగానికైనా వెనకాడను అన్నారు. మీ కష్టంలో నాకు ముందు భాగం ఇవ్వండి మీ సంతోషంలో నాకు చివరి స్థానం ఇవ్వండి. బలరామనేవాడికి పదవి అక్కర్లేదు, సన్యాసం తీసుకోవాలి అనుకున్న నాకు పదవులపై వ్యామోహం ఉంటుందని అనుకోవడం ప్రత్యర్థుల వెర్రితనం. సన్యాసం వైపు వెళ్లాలనుకున్న నేను రాజకీయాల వైపు రావడానికి ముఖ్య కారణం ప్రజలను అధికారం అనే పేరుతో నాయకులు, పాలకులు చేస్తున్న అన్యాయాలను నా వంతుగా ఎదిరించి ప్రజల తరపున పోరాడాలని రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజాసేవే నా అంతిమ లక్ష్యం ఒక్కసారి నేను ప్రజాక్షేత్రంలోకి వచ్చాక నా వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి, ఆఖరికి సొంత ఊరికి కూడా సమయం కేటాయించలేనంతగా ప్రజల కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాను. జనసేన పార్టీకి ఓటు వేయండి నాకు కాదు నేను అడిగేది అదే. పార్టీని బలోపేతం చేద్దాం అంతగా అవసరం అయితే అప్పుడు పవన్ కళ్యాణ్ ని ఒప్పించి ఇక్కడ పోటీ చేయిద్దాం. గొప్ప మెజారిటీతో గెలిపించుకుందాం. ఇప్పుడున్న రాజకీయ నాయకులు నెంబర్ వన్ నియోజకవర్గం అనే పేరు చెప్పి వాళ్లు ఆర్థికంగా నెంబర్ వన్ అవుతున్నారు తప్ప ప్రజలు అన్ని వనరులను కోల్పోయి ఎన్నో అవస్థలు పడుతున్నారు. చివరికి మంచినీటి సదుపాయం కూడా లేని స్థితిలో ప్రజలు ఉన్నారు. పేరుకి మనకి పక్కనే గోదావరి ఉన్న ఆ నీళ్లు మన నియోజకవర్గంలో కొన్ని గ్రామాలకు గొంతు తడప లేకపోవడం బాధాకరం. 4 వేల కోట్లతో ట్యాంకర్లు ఏర్పాటు చేస్తామన్నారు 4000 పెట్టి ఒక ట్యాంకర్ వాటర్ కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితిలో ప్రస్తుతం మనం ఉన్నాం. కాపు కార్పొరేషన్ ద్వారా కళ్యాణ మండపాలు ఏర్పాటు చేస్తామన్నారు, ఆ ఊసే లేకపోగా ప్రజలకి ఇస్తానన్న ఇళ్ల స్థలాలను కూడా ఇవ్వకుండా మోసగిస్తున్నారు. వైద్య సదుపాయాల గురించి అయితే చెప్పనక్కర్లేదు, మండలానికి రెండు హాస్పిటల్స్ అన్నారు ఉన్న హాస్పిటల్లో సిబ్బంది లేక ప్రజలు వైద్య సదుపాయాలకు దూరంగా వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదంతా చేసి కూడా వారు మళ్లీ మీ దగ్గరికి వస్తారు, వచ్చి రాబోయే రోజుల్లో మంత్రివర్గంలో నాకు చోటు ఉండబోతుంది మీకు ఏం కావాలన్నా నేను చేసి పెడతానని మళ్లీ మభ్య పెట్టబోతారు. దీన్ని తిప్పుకొట్టడానికి అందరూ సంసిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు. అలాగే ప్రత్యర్ధులు వెంట ఉండే ఒక పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. అదేంటంటే ఒకప్పుడు చిన్న జనసేనలో చేరి మళ్లీ సొంతగూదు అయిన వైసీపీలోకి వచ్చేస్తున్నారు, అలాగే బలరామకృష్ణ కూడా జనసేనని వదిలి తొందర్లో వైసీపీలోకి వస్తారు అనే అంశాలపై కథనాలు రాస్తున్నారు అలాంటి తక్కువ స్థాయి వ్యక్తులకు ఒకటే చెపుతున్నా ఒక్క అమ్మకు పుట్టి ఉండే నామీద చేసే ఆరోపణలలో నిజాలు ఎంతున్నాయో ప్రజలకు చూపించాలి. మమ్మల్ని ఎదుర్కోవడానికి దమ్ము లేక ఇలాంటి దద్దమ్మ పనులు చేస్తున్నారు. జనసేనకి జనసైనికులకి చివరిగా చెప్పేది ఏమిటంటే నా అంతిమ శ్వాస వరకు నా జనసేనని వదలను, నేను నా అంతిమయాత్రలో కూడా నా శవంపై జనసేన జెండాని కప్పి తీసుకెళ్ళాలని తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.