విశాఖలో మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన

విశాఖపట్టణం, రాజకీయాల్లో మార్పు కోసం యువత ఓటు నమోదు చేసుకొని వినియోగించుకోవాలని, నవసమాజ నిర్మాణానికి పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇవ్వాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలో మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో 32 వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు, దక్షిణ నియోజకవర్గం వార్డు అధ్యక్షులు చంటి, శ్రావణ్, యజ్ఞశ్రీ, గరికిన రవి, శ్రీనివాస్, లంకా త్రినాథ్, రూపా, తెలుగు అర్జున్ మరియు నియోజకవర్గ నాయకులు వాసుపల్లి నరేష్, శ్రావణి, ప్రణీత్, తెలుగు లక్ష్మీ మరియు జనసైనికులు, వీరమహిళలు పాల్గొనడం జరిగినది.