పెందుర్తిలో ‘నా సేన కోసం నా వంతు’

పెందుర్తి, జనసేన పార్టీ సెంట్రల్ కమిటీ ఆదేశాల మేరకు 88వ వార్డ్ కాపు జగ్గరాజుపేట గ్రామంలో క్రియాశీలక సభ్యులతో జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన నా సేన కోసం నా వంతు అనే కార్యక్రమాన్ని జనంలోకి తీసుకువెళ్లడానికి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వబ్బిన జనార్థన శ్రీకాంత్ మాట్లాడుతూ నా సేన నా వంతు ఆనే కార్యక్రమం పార్టీ విజయానికి చాలా ఉపయోగపడుతుందని, దేశంలోనే ఆం ఆద్మీ, బహుజన సమాజ్వాది పార్టీలు క్రౌడ్ ఫండింగ్ తోనే అధికారంలోకి వచ్చిందని గుర్తు చేస్తూ, ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రజల్లోకి తీసుకుని వెళ్ళగలిగితే మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి కొంతవరకు ఆర్దిక వెసులుబాటు కల్పించడానికి అవకాశం ఉంటుంది మరియు ప్రజల్ని మమేకం చేయడం వల్ల పార్టీ అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం అవుతారని, కావున పార్టీ ఆదేశాల మేరకు మనం మన కుటుంబ సభ్యులు, పార్టీ సానుభూతిపరులు, సామాన్య ప్రజలను ఈ యొక్క కార్యక్రమంలో మమేకం చేయడానికి మీ యొక్క గ్రామాల్లో మీరే నాయకత్వం వహించి ప్రజల్లోకి తీసుకుని వల్లే బాధ్యతను తీసుకోవాలని కోరడం జరిగింది. సత్యనారాయణ మాట్లాడుతూ తప్పకుండా ఇది ఒక మంచి కార్యక్రమం పార్టీ మొదలుపెట్టిందని మనమందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పడం జరిగింది. అభి మాట్లాడుతూ ఇప్పటివరకు మనమందరం మన యొక్క గ్రామాల్లో కష్టపడ్డామని ఇప్పుడు పార్టీ అభివృద్ధి కోసం మనందరం కలిసికట్టుగా ఉంటూ సమస్యల పైన మన పార్టీ కార్యక్రమాలను జనాల్లోకి తీసుకుని వెళ్ళడానికి మరింతగా కష్టపడాలని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు, శ్రీను, రమేష్, నర్సింగరావు, గోపి, ప్రసాద్, చిన్న, చలం, సర్వ సిద్దిరాజు, తేజ, భాను, భాగ్యరాజ్, మరియు జన సైనికులు పాల్గొన్నారు.