సర్వేపల్లిలో ‘నా సేన కోసం నా వంతు’

సర్వేపల్లి, జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు, గోవిందరాజుపురం గ్రామాలలో 5000/- రూపాయలను జనసేన పార్టీ ఫోన్ పే నెంబర్ కి పంపించడం జరిగింది. ఇదే విధంగా ప్రజలలో చైతన్యం తీసుకువచ్చే విధంగా నా సేనకి నా వంతు అనే నినాదంతో ఎక్కువమంది ప్రజలని పార్టీలో భాగస్వామ్యం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తామని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.