నా ఓటు పదిలం- మీ ఓటు పదిలమేనా?!

  • రాజ్యాంగం ప్రసాదించిన గొప్ప వరం ఓటు
  • ప్రతి ఒక్కరూ ఓటు కలిగి ఉండాలి
  • ఓటరు జాబితాలో ఓటు ఉందో? లేదో? పరిశీలించుకోవాలి
  • 18 ఏళ్ళు నిండినవాళ్లు, జాబితాలో ఓటు లేని వాళ్ళు కొత్తగా చేర్చుకోవాలి
  • 20,21 పోలింగ్ కేంద్రాల ఓటరు జాబితాను పరిశీలించిన జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు

పార్వతీపురం: ఓటరు జాబితాలో నా ఓటు పదిలం.. మీ ఓటు పదిలమేనా..? అని జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు అన్నారు. ఆదివారం జరిగిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మున్సిపాలిటీలోని సంస్కృత పాఠశాలలో ఏర్పాటుచేసిన 20, 21 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఓటరు జాబితాను ఆయన పరిశీలించారు. ఆ జాబితాలోని చేర్పులు, తొలగింపులు, బదిలీలు తదితర వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బిఎల్వోలు వి. కిరణ్, బి. సంతోషులతో మాట్లాడి ఓటరు జాబితా లోని చేర్పులు, మరణాలు, తొలగింపులు, బదిలీలు తదితర వాటిపై చర్చించారు. ఎటువంటి తప్పిదాలు లేకుండా స్పష్టమైన, పరిపూర్ణమైన ఓటరు జాబితా రూపొందాలన్నారు. ఈ సందర్భంగా తన ఓటును జాబితాలో తనిఖీ చేశారు. జాబితాలో తన ఓటు పదిలంగా ఉందన్నారు. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు. వాటికి అనుగుణంగా ప్రతి ఓటరు బాధ్యతగా తమ ఓటు జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవాలన్నారు. ఒకవేళ లేకపోతే మళ్లీ చేర్చుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి, యువకులు ఓటర్లుగా నమోదుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఓటు అనేది రాజ్యాంగం ప్రసాదించిన వరం అన్నారు. అటువంటి దాన్ని పొందేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించి అధికారులకు సహకరించాలన్నారు. అలాగే ప్రతి ఒక్క ఓటరు చైతన్యం పొంది ఎన్నికల్లో ఓటును వినియోగించుకోవాలన్నారు. ఓటింగ్ శాతం పెరిగేలా చైతన్యం నింపుకోవాలన్నారు. అలాగే ప్రలోభాలకు లొంగని ఓటర్ల సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలి అన్నారు. ఓటరు జాబితాలో తన ఓటు పదిలంగా ఉందన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ తమ ఓటు జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత ఓటు నమోదులో ముందుకు రావాలన్నారు.