మైలవరం నియోజకవర్గ జనసేన ఆత్మీయ సమావేశం

మైలవరం, జి కొండూరు మండలం నాయకులు బత్తిన శ్రీనివాస్ ఇంటి వద్ద జి కొండూరు మండల అధ్యక్షులు వై.ఎల్ నరసింహారావు అధ్యక్షతన జనసేన మైలవరం నియోజకవర్గం జనసైనికుల సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా జనసేన మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కల రామ్మోహన్ రావు పాల్గొనడం జరిగింది. జనసేన పార్టీ విధి విధానాల గురించి, ఇకముందు చేయబోయే కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బొలియశెట్టి శ్రీకాంత్, చింతల లక్ష్మి, మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు పోలిశెట్టి తేజ మరియు జనసేన నాయకులు వై ఎన్ ఆర్, సుందరం రెడ్డి, నాగబాబు, కార్యకర్తలు సునీల్, నజీర్ మహేష్, రామకృష్ణ, క్రాంతి మహేష్, శ్రీనివాస్, ప్రభాకర్ సురేష్, సుజాత, స్వామి చక్రధర్, రాము వెంకటస్వామి వివిధ మండల కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియాలో జనసైనికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.