అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన మైలవరం జనసేన

మైలవరం జనసేనపార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 131 వ జయంతి సందర్భంగా మైలవరం సెంటర్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని, అంబేద్కర్ గారి బాటలోనే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనా విధానం ఉంటుందని, అట్టడుగు వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా జనసేన పార్టీ పని చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీరమహిళ దోసపాటి శశికళ, నాయకులు పొన్నూరు విజయ్, పడిగల ఉదయ్, రమేష్ బాబాయ్, మల్లారపు దుర్గాప్రసాద్, ఈతకొట్టు నాని, మాదాసు సుబ్బారావు, ఉయ్యూరు నాగరాజు, జనసైనికులు నరేష్, గోపి, తదితరులు పాల్గొన్నారు.