నాదెండ్ల మాట కాకినాడ సిటీలో అందరి నోట

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో నాదెండ్ల మనోహర్ మాట కాకినాడ సిటీలో అందరి నోట కార్యక్రమం శనివారం వాశిరెడ్డి సత్యకుమార్ ఆధ్వర్యంలో 41వ డివిజన్ రెడ్ క్రాస్ హాస్పిటల్ ప్రాంతంలో జరిగింది. ఈ సంధర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ పి.ఏ.సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ బట్టబయలు చేస్తున్న ప్రభుత్వ అవినీతిలను తాము నాదెండ్లగారు మాట కాకినాడలో అందరినోట అనే నినాదంతో ప్రతిరోజూ చైతన్య యాత్రని చేస్తున్నామన్నారు. వై.ఎస్.ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన ఒక్కో పనీ ఒక్కో స్కాముగా బయటకి వస్తున్నాయన్నారు. అందుకు ఉదాహరణే, గేదెల కొనుగోలు స్కాము, పిల్లల స్కూలు బ్యాగు&షూలు స్కాము, జగనన్న ఇళ్ళు స్కాము, అమ్మ ఒడి స్కాం, సర్వసిక్షణా అభియాన్ పధక నిధులల స్కాము ఇలా వెతికే కొద్దె బయటపడుతున్నాయన్నారు. ఇవన్నీ యెక్కడ బయటపడతాయో అనేనా గవర్న్మెంట్ వెబ్సైటులో జీవోలను పెట్టలేదని ఎద్దేవా చేసారు. ఆఖరుకి గవర్న్మెంటు జీవోల కోసం కూడా కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితిని తీసుకువచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని విమర్శించారు. ఈ వై.సి.పి అవినీతిని ప్రజలకు తెలియచేసేందుకే తాము ఈ చైతన్య యాత్రని చేపడుతున్నామని అన్నారు. రానున్న ఎన్నికల రోజుల్లో మరిన్ని మాయ మాటలు కధలతో ఈ వై.సి.పి ప్రభుత్వం ప్రజలమీద పడుతుందనీ జాగ్రత్తగా గమనించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి సత్యకుమార్, రమణ, నానాజీ, నూకరాజు, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.