ఉదయ్ శ్రీనివాస్ కి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన నాగబాబు

పిఠాపురం నియోజకవర్గం, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు కుమారుడు, ప్రముఖ కధానాయకులు వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల వివాహ మహోత్సవానికి ఆహ్వానిస్తూ, వివాహ ఆహ్వాన పత్రికను నాగబాబు మంగళవారం నాడు పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కి అందజేశారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు.