బత్తుల ఆధ్వర్యంలో నాగంపల్లి జనసేన గ్రామ కమిటీ

రాజానగరం, రాబోయే ఎన్నికలకు జనసేన పార్టీని మరింత బలపరిచి ముందుకు తీసుకెళ్లడానికి గెలుపే లక్ష్యంగా పని చేయడానికి గ్రామ కమిటీలు ఎంతగానో ముఖ్యపాత్ర పోషిస్తాయి. రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం నాగంపల్లి గ్రామంలో ప్రతిష్టాత్మకంగా జనసేన పార్టీ గ్రామ కమిటీలో సభ్యులను నియామకము చేసి వారికి నియామక పత్రాన్ని రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ బత్తుల బలరామకృష్ణ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీతానగరం మండల జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.