నల్లా పెద్దకాపుని ఆదుకున్న నల్లా శ్రీధర్

అమలాపురం, ఉప్పలగుప్తం మండలం, గొల్లవిల్లి పంచాయతీ, వాడపర్రు గ్రామానికి చెందిన నల్లా పెద్దకాపుకి పక్షవాతం రావడంతో జీవనాధారం కోల్పోవడం జరిగింది. అమలాపురం నియోజకవర్గ పార్లమెంటరీ గౌరవ అధ్యక్షులు నల్లా శ్రీధర్ జీవనోపాధి కోసం 20000 రూపాయలు విలువచేసే 5 మందు స్ప్రేయర్లను అద్దెకు ఇచ్చుకునేలా ఇవ్వడం జరిగింది. జీవనోపాధి కోల్పోయిన నల్లా పెద్దకాపుని ఆదుకున్న నల్లా శ్రీధర్ ని గ్రామస్తులు అభినందించడం జరిగింది.