నందికొట్కూరు జనసేన ఆధ్వర్యంలో జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు

నందికొట్కూరు నియోజకవర్గంలోని జనసేన పార్టీ తరఫున జగనన్న ఇల్లు పేదలకు కన్నీళ్లు అనే ప్రోగ్రాం నందికొట్కూరు నియోజకవర్గంలోని కొణిదెల రోడ్డులో ఉన్నటువంటి జగనన్న కాలనీలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పర్యటించినటువంటి జనసేన పార్టీ నాయకులు నల్లమల్ల రవికుమార్ బోరెల్లి వెంకటేష్ కాకర్ల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోని ముఖ్య అనాలసిస్ కొణిదెల రోడ్డుకు వెళ్తా ఉంటే వెడమవైపు 1500 బిల్డింగులు మరియు కుడివైపు 2500 బిల్డింగులు జగన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇక్కడ 60 శాతం ఇల్లులు స్లాబ్ అయిపోయి ప్లాస్టింగ్ జరుగుతా ఉన్నాయి 20% స్లాప్ వరకు వచ్చాయి, మిగతా 20 శాతం బేస్ మట్టాలు మరియు మొదలుపెట్టనివిగా ఉన్నాయి. ఒక గృహానికి జగన్ ప్రభుత్వం నుండి 1,80,000 ఇవ్వడం జరుగుతా ఉంది అందులో భాగంగా 90 బస్తాల సిమెంటు, 480 కేజీల ఐరన్, మూడు ట్రాక్టర్ల ఇసుక, ఇచ్చి నగదు ₹1,10,000 ఇవ్వడం జరుగుతా ఉంది. అనగా 70 వేల రూపాయల సరుకు లక్ష పదివేల రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతోంది. స్థలము ప్రతి బిల్డింగ్ కి ఒక సెంటు అందులో ఒక బెడ్ రూమ్, హాలు, కిచెన్, బాత్రూం, ఇవ్వబడింది. ప్రతి ఒక్కరి ద్వారా మేము తెలియజేసుకున్నది ఏమంటే జగనన్న ఇచ్చే డబ్బు బిల్డింగ్ పూర్తి చేసుకోవడానికి సరిపడట్లేదు బిల్డింగ్ పూర్తి చేసుకోవడానికి కనీసము 6 నుంచి 8 లక్షలు ఖర్చు అవుతుంది జగనన్న ఇచ్చే లక్ష 80 రూపాయలు తీసివేసి మాకు మిగతా డబ్బు అప్పుగా తెచ్చి కట్టించుకొనుచున్నాము ఈ గృహాలు తొందరగా పూర్తి చేసి ఇచ్చేస్తే బావుంటుందని ఆశిస్తున్నాను. అక్కడ చాలామందికి నీటి సౌకర్యం లేదు. కరెంటు సౌకర్యం లేదు అవి ప్రభుత్వం తొందరగా కల్పించాలని కోరుకుంటున్నారని తెలిపారు.