నాని 28వ సినిమా అప్డేట్

నేచురల్ స్టార్ నాని నటించబోయే 28వ సినిమా అప్డేట్ కూడా వచ్చేసింది. మైత్రిమూవీస్ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా లో నాని సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా నానికి జోడిగా నటిస్తుంది. ‘రాజారాణి’ సినిమాతో నజ్రియా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఇక ఈ సినిమా టైటిల్ ను నవంబర్ 21న అనౌన్స్ చేయనున్నారు. ఈమేరకు చిత్రయూనిట్ ఓ పోస్టర్ ను విడుదల చేసారు. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.