‘వి’ ప్రీమియర్‌పై నాని స్పందిస్తూ

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో మోహనకృష్ణ ఇంద్రగంటి రచించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘వి’.  అమెజాన్ ప్రైమ్ వీడియోపై సెప్టెంబర్ 5న విడుదలయ్యే ‘వి’ని చూడవచ్చు అంటూ అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. అయితే తన చిత్రం డిజిటల్ ఫార్మెట్‌లో విడుదల అవుతున్నందుకు చాలా ఉద్వేగంగా ఉన్నానని నాని తెలిపారు.

నాని మాట్లాడుతూ.. ‘‘యాక్షన్ థ్రిల్లర్స్‌ను నేను ఎంతగానో ఇష్టపడుతాను. అలాంటి థ్రిల్లర్స్‌లో ఒకటి ‘వి’. ఇది థ్రిల్‌ను, యాక్షన్‌ను అందిస్తుంది. సుధీర్ బాబు, నేను నటించిన పాత్రల మధ్య జరిగే ఎలుకా- పిల్లి ఆట నేను ఈ సబ్జెక్ట్ పై దృష్టి పెట్టేలా చేసింది. ‘వి’ అంతర్జాతీయ ప్రీమియర్‌పై నేనెంతో ఉద్వేగంగా ఉన్నాను. సినీ పరిశ్రమలో ఇది నా 25వ సినిమా. 200 దేశాలు, టెరిటరీస్‌లలో ‘వి’ని ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రైమ్ వీడియోలో చూసే అవకాశం నా అభిమానులకు, మద్దతుదారులకు కలిగింది. వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకునేందుకు ఇంతకు మించిన మార్గం మరొకటి లేదు. ఓ ఆసక్తిదాయక అంశం ఏమిటంటే.. నా మొదటి సినిమా విడుదల అయిన రోజే.. అంతర్జాతీయంగా ఈ సినిమా ప్రదర్శన జరుగనుంది…అదే సెప్టెంబర్ 5’’ అని అన్నారు.