కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న లక్ష్మీనారాయణకు అండగా నరసరావుపేట జనసేన

నరసరావుపేట జనసేన పార్టీ ఇంచార్జ్ జిలానీ అధ్వర్యంలో దొండపాడు గ్రామంలో నివసిస్తున్న జనసేన నాయకులు లక్ష్మీనారాయణ కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో ఆరోగ్యం బాగా లేని కారణంగా, అతని ఆర్థిక పరిస్థితి బాగా లేని కారణంగా నరసరావుపేట జనసేన పార్టీ తరఫు నుండి 33 వేల రూపాయలు నగదు మరియు క్వింటా బియ్యం, 20 కేజీల నూనె, పండ్లు కూరగాయలు తీసుకొని దొండపాడు గ్రామంలోనే ఆదివారం లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి లక్ష్మీనారాయణకు అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో నరసరావుపేట టౌన్ ప్రసిడెంట్ గివిఎస్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి రాజా భరత్, జిల్లా నాయకులు బెల్లంకొండ ఈశ్వర్, మండల ప్రసిడెంట్ గోవిందు, యద్ధల శ్రీను, రామిశెట్టి రామకృష్ణ, అల్లా శ్రీను, పమిడీపాడు శ్రీను, హనుమంతు, ఎస్కె మస్తాన్(ములకలురు) మొదలగు వారు పాల్గొన్నారు.