మెగాస్టార్ పై వైసీపీ నాయకుల విమర్శలను ఖండించిన నరసింహా చారి

తాడిపత్రి నియోజకవర్గం: మెగాస్టార్ చిరంజీవిపై వైసీపీ నాయకులు మంత్రులు చేస్తున్న విమర్శలను తాడిపత్రి జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు కుందుర్తి నరసింహా చారి తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చిరంజీవి గారు చెప్పిన దానిలో తప్పేముంది నిజాలే మాట్లాడారు, ప్రభుత్వానికి ఒక సలహా ఇచ్చారు అంతే కదా. మీరు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం గురించి, ప్రాజెక్టుల గురించి, పేదవాడి కడుపు నింపే ఉద్యోగ ఉపాధి కల్పన గురించి ఆలోచించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించండి. అలా కాదని పిచ్చుక పై బ్రహ్మాస్త్రం లాగా ఇండస్ట్రీ మీద పడతారేంటి? ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే ప్రభుత్వాలను గుండెల్లో పెట్టుకుంటారన్నారు. ఆయన చెప్పిన వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి వైపు దృష్టి సారించకుండా పట్టుమని పది నిముషాలు తమ శాఖలు గురించి మాట్లాడలేని మంత్రులందరూ మీడియా ముందుకు వచ్చి అదేదో బ్రహ్మాండం బద్దలైనట్టు ఏదేదో ఆయన గురుంచి మాట్లాడటం సరికాదని ఏద్దేవా చేశారు. ఏపీ ప్రభుత్వం సినిమా పరిశ్రమపై కాకుండా ఉద్యోగాలు, పేదలపై దృష్టి సారించాలన్న మెగాస్టార్ చిరంజీవి గారి వ్యాఖ్యలను తెలుగు ప్రజలందరూ సమర్థిస్తున్నారని అనే విషయాన్ని వైసీపీ నాయకులు అర్థం చేసుకోవాలని హితవు పలికారు.