కదిరి జనసేన ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు

కదిరి: జాతీయ రైతు దినోత్సవం సందర్బంగా జనసేన పార్టీ పిలుపు మేరకు శుక్రవారం కదిరి నియోజకవర్గ ఇంచార్జ్ భైరప్రసాద్ పిలుపు మేరకు తనకల్లు మండల కన్వీనర్ కె.వి.రమణ ఆధ్వర్యంలో.. జనసేన కార్యక్రమాల కమిటీ సభ్యులు జాతీయ రైతుల దినోత్సవ కార్యక్రమాన్ని మండల పరిసర ప్రాంతాలలో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా జనసేన కార్యక్రమాల కమిటీ సభ్యులు మండల పరిసర ప్రాంతాలలోని రైతుల దగ్గరకు వెళ్లి మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యల తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన నాయకులు మాట్లాదుతూ జనసేన ప్రభుత్వం వస్తే వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని, అందుకు కారణం పవన్ కళ్యాణ్ గారు నేరుగా వ్యవసాయ శ్రమ చేసినవారని ఆయన రైతుల ఆవేదన అర్థం చేసుకున్న నాయకుడని, రాష్ట్రంలో 3000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాలు ఆదుకోవడానికి 30 కోట్లు కేటాయించి ఒక్కో కుటుంబానికి లక్ష చొప్పున ఇచ్చిన దేశంలో ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని జనసైనికులు అన్నారు. జనసేన అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో భాగంగా రైతుకి నెలకి 5000 నుంచి 8000 రూపాయలు పెన్షన్ వస్తుందని, మరియు వివిధ సోలార్, ఉచిత కరెంట్ వంటి హామీలను వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల కన్వీనర్ కె.వి రమణ కార్యక్రమాల నిర్వహణ కమిటీ పర్యవేక్షకుడు ఫయాజ్ మరియు తనకల్లు మండల ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, షేక్ కాలెషా, పలవర శ్రీనివాసులు, కొట్టి అనిల్ కుమార్, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.