నాటుసారా విక్రయాలను అరికట్టాలి: సిజి రాజశేఖర్

పత్తికొండ నియోజకవర్గం: జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ బాధ్యుడు రాజశేఖర్ మాట్లాడుతూ.. పత్తికొండ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల కంటే పత్తికొండ పట్టణం నందు జోరుగా నాటు సారా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. వివిధ కాల నుంచి మాకు ఫోన్ ఫోన్ చేసి చెప్తున్నారు. మా కాలనీ నందు నాటసార వ్యాపారాలను బందు చేయించండి అన్న మేము ఒక రోజుకు రెండు వందల రూపాయలు సంపాదించడమే కష్టమైన ఈ రోజుల్లో కష్టపడి సంపాదించిన డబ్బులను మాతో గొడవపడి మా ఇంట్లో వారు మా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం లాక్కెళ్తున్నారు, ఇంతవరకు ఎంతోమంది నాయకులు చెప్పాం కానీ ఎవరు అరికట్టలేక పోతున్నారు. కనీసం మీరైనా మా బాధలను అర్థం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించండి అన్నా అని అంటున్నారు, అందుకే ఈరోజు పత్తికొండ లో ఉన్న ఎక్స్చేంజ్ సిఐ ప్రశాంత్ విజయ్ కుమార్ గారిని కలిసి పత్తికొండ టౌన్ నందు నాటసార అమ్మే వారిపై చర్యలు వెంటనే చేపట్టాలని తెలియజేయడం జరిగింది. రెండు వారాల లోపల ఈ సమస్యను పరిష్కరించుకుంటే ఎస్పీ గారిని కలుస్తామని తెలియజేశారు, పత్తికొండలో అత్యధికంగా రోజువారి కూలీలు లేబర్ పనులు చేసే వాళ్ళు ఎక్కువగా నివసిస్తున్నారు, ప్రతిరోజు నాటు సారా తాగి వారి జీవితాలతో వారి కుటుంబ సభ్యుల జీవితాలను కూడా సర్వనాశనం అవుతున్నాయి, ముఖ్యంగా 15 సంవత్సరాల యువత నాటసార తాగి రోడ్లపై దొర్లుతున్న సంఘటనలు చాలా బాధాకరం, ఈ నాటసార త్రాగడం వల్ల, ఎంతోమంది అనారోగ్యాలతో ఆసుపత్రి పాలవుతున్నారు, నాటసార అమ్మే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పత్తికొండ సెబ్, సి ఐ ప్రశాంత్ విజయ్ కుమార్ ను కలిసి జనసేన పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రెండు వారాల లోపల నాటు సారా అమ్మే వారిపై సరైన చర్యలు తీసుకొని కంట్రోల్ చేయకుంటే జనసేన పార్టీ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ గారిని కలుస్తామని సెబ్ సిఐ గారికి కూడా తెలియజేయడం జరిగింది. అలాగే నాటసారా అమ్మకాలను అరికట్ట లేకుంటే జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆఫీస్ ముందు ధర్నాలు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు, వడ్డే వీరేష్, హోసూర్ సుధాకర్, అజయ్, పెండేకల్ రవి, చాకలి విరేష్, రఘు మరియు తదితరులు కార్యక్రమం పాల్గొన్నారు.