దీపిక సమాధానాలతో ఎన్సీబీ అధికారుల అసంతృప్తి

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ కోసం ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకునే శనివారం నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) ముందు విచారణకు హాజరైంది. ఈ సందర్భంగా దీపిక చెప్పిన సమాధానాలతో ఎన్సీబీ అధికారులు అసంతృప్తికి గురయ్యారు. ఈ కేసులో కీలకంగా ఉన్న కరిష్మా ప్రకాశ్ తో తనకు సాధారణ సంబంధాలే తప్ప డ్రగ్స్ సంబంధాలు లేవని దీపిక తెలిపింది. అయితే ఎన్సీబీ అధికారులు ఆమె వాదనలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, డ్రగ్స్ కోణంపై ఎన్.సి.బి విచారణ సంచలనంగా మారింది. ప్రముఖ జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఎన్సిబి ప్రశ్నించే సమయంలో మూడు సార్లు మనసు విరిగి కేకలు వేస్తూ దీపిక పదుకొనే ఏడ్చేశారని తెలుస్తోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) ప్రశ్నించినప్పుడు బాలీవుడ్ నటి దీపికా పదుకొనే మూడుసార్లు కేకలు వేసిందని ఆ కథనం పేర్కొంది. బాలీవుడ్ పరిశ్రమతో సంబంధాలు ఉన్న పెద్ద మాదకద్రవ్యాల పెడ్లర్ ను విచారించడం ద్వారా మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో అధికారులు తమ దర్యాప్తు పరిధిని విస్తృతం చేయాలని చూస్తున్నారని ఈ వార్తా కథనం వెల్లడించింది. పెడ్లర్ల వాంగ్మూలాన్ని కోర్టుకు ఇస్తామని ఎన్.సి.బి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎంఏ జైన్ పేర్కొన్నట్లు సదరు జాతీయ మీడియా కథనంలో పేర్కొంది.