కళ్యాణదుర్గం పట్టణంలో ఎన్.డి.ఏ కూటమి ఉమ్మడి ప్రచారం

కళ్యాణదుర్గం పట్టణ మున్సిపాలిటీ: కళ్యాణదుర్గం నియోజకవర్గంకు కాబోయే ఎమ్మెల్యే & టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకి మద్దతుగా ఆదివారం కళ్యాణదుర్గం పట్టణ మున్సిపాలిటీలో 10వవార్డు మేడవీధిలో జనసేన, టిడిపి ఆధ్వర్యంలో ఇంటింటా ఉమ్మడి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమానికి జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ప్రచారంలో ప్రతి ఇంటికి “బాబు షూరిటీ – పవన్ గ్యారెంటీ” పథకాలు, సూపర్ సిక్స్ పథకాలు, మేనిఫెస్టో అంశాలు గురించి తెలియజేయడం జరిగింది. ఈ ప్రచారంలో జనసేన పార్టీ తరఫున వీరమహిళలు, పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, జనసైనికులు, జనసేన, టిడిపి కార్యకర్తలు, నాయకులు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.