Tirupati: భూకబ్జాలే తిరుపతి వరదలకు కారణం – జనసేన నాయకులు

• బాధిత కుటుంబాలకు రూ.10 వేల తక్షణ సాయానికి డిమాండ్

తిరుపతిని వరదలు ముంచెత్తడానికి కబ్జాలే కారణమని జనసేన పార్టీ తిరుపతి ఇంఛార్జ్ శ్రీ కిరణ్ రాయల్ ఆరోపించారు. ఒక మంచి లక్ష్యంతో శ్రీ కృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన చెరువులన్నీ రాజకీయ నాయకుల చెరలోకి వెళ్లిపోవడం వల్లే వర్షపు నీరు ఇళ్ల మీద పడిందని తెలిపారు. పార్టీ నాయకులతో కలసి తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కిరణ్ రాయల్ మాట్లాడుతూ… అల్పపీడన ప్రభావంతో నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల కారణంగా దెబ్బ తిన్న వార్డుల్లో కార్పోరేటర్లు సాయం అందించాలి. ప్రజల ఓట్లతో గెలిచిన 50 మంది అధికార పార్టీ కార్పోరేటర్లు వారి ప్రభుత్వాన్ని అడిగి తెస్తారో, వారి జేబుల్లో నుంచి ఇస్తారో తెలియదు. వరదల కారణంగా ఇబ్బందులు పడిన ప్రతి కుటుంబానికీ రూ. 10 వేల తక్షణ సాయం అందించాలి. ఒకరిద్దరు మినహా వైసీపీ కార్పోరేటర్లంతా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం మినహా సాయం చేయడం లేదు. వారంతా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి తక్షణ సాయం అందించాలి. నాడు ముఖ్యమంత్రి పదవి కోసం పాదయాత్ర చేసిన శ్రీ జగన్ రెడ్డి ప్రజలు కష్టాల్లో ఉంటే ఏరియల్ సర్వేలు చేసిపోతున్నారు అని అన్నారు.